భద్రాచలంలో ఘనంగా కార్తీక పౌర్ణమి జ్వాలాతోరణం

​కలం, ఖమ్మం బ్యూరో: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాచలం (Bhadrachalam)లో జ్వాలాతోరణం వేడుక ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ ప్రాంతంలోని అమ్మవారి ఆలయం, శివాలయ ప్రాంగణంలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగింది. ​ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జ్వాలాతోరణాన్ని వెలిగించారు. ​కార్తీక పౌర్ణమి రోజున జ్వాలాతోరణం గుండా వెళ్లడం పుణ్యప్రదమనే విశ్వాసంతో భక్తులు జ్వాలాతోరణం కింది నుంచి వెళ్లి దైవదర్శనం చేసుకున్నారు. తమ మొక్కులను చెల్లించుకున్నారు. ​జ్వాలాతోరణం వేడుకతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>