కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లా ఎన్కూరు మండల పోలీసులు (Enkoor Police) ఒక పేకాట స్థావరంపై దాడి నిర్వహించారు. ఈ ఘటనలో ఒకరిని అదుపులోకి తీసుకోగా, మరో నలుగురు పరారయ్యారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు కల్లూరు ఏసీపీ శ్రీ సాంబరాజు తెలిపారు. భగవాన్ నాయక్ తండా గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పోలీసులు వెళ్లారు. గమనించిన నలుగురు అక్కడి నుంచి పారిపోగా, గుగులోతు రమేష్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భగవాన్ నాయక్ తండాకు చెందిన గుగులోతు రమేష్, బానోత్ కళ్యాణ్ కుమార్, బానోత్ కృష్ణ, బానోత్ రాజా, ధారవత్ శంకర్‌గా గుర్తించి కేసు నమోదు చేశారు. వారి నుంచి రూ.7,500 నగదు, ఒక బైక్, రెండు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

