మూసీ పునరుజ్జీవం, రేడియల్ రోడ్లపై సీఎం రేవంత్ సమీక్ష

కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహింప తలపెట్టిన మూసీ పునరుజ్జీవం, రేడియల్ రోడ్ల పురోగతి, పట్టణాభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు మూసీ పునరుజ్జీవం ప్రాజెక్ట్ ఫేజ్-1 పనులపై వివరాలపై ఆరా తీశారు. ఫేజ్-1లో భాగంగా హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.20 కి.మీ ప్రాంతాన్ని జోన్-1 ఏ గా, ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8 కి.మీ ప్రాంతాన్ని జోన్-1 బీగా విభజించి పనులు చేపట్టనున్నట్లుగా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఫేజ్-1 పనులు జనవరి 2027లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే ఫేజ్-1 టెండర్ల ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపారు.

అటు మిరాలం ట్యాంక్ అభివృద్ధి పనుల పురోగతిపై సీఎం రేవంత్ సమీక్షించారు. మిరాలం చెరువు అభివృద్ధితో పాటు చెరువులో ఎంతో కాలంగా పేరుకుపోయిన పూడికను తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు చెరువు అభివృద్ధి పనులను సీఎంకు అధికారులు వివరించారు. జనవరి 2028 నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నట్లు తెలిపారు. రేడియల్ రోడ్ల నిర్మాణం, భూసేకరణ పురోగతితో పాటు గండిపేట వద్ద నిర్మాణంలో ఉన్న ఆధునిక గోశాల పనుల పురోగతి పనులను సీఎంకు వివరించారు. ఈ మేరకు అధికారులతో చర్చించిన సీఎం.. రేడియల్ రోడ్ల నిర్మాణంలో వేగం పెంచాలని దిశానిర్దేశం చేశారు. మార్చి 2027 నాటికి పనులు పూర్తి చేయాలన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>