కలం, వెబ్‌డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో మూడు రోజుల పాటు వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Telangana Weather Alert) వెల్లడించింది. ఇందులో భాగంగా నవంబర్ 24న ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, వనపర్తి, నాగర్‌కర్నూల్, గద్వాల జిల్లాల్లో వర్షాలు పడతాయని అంచనా వేసింది. అలాగే నవంబర్ 25 నుంచి 27 వరకు హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో చినుకులు పడే అవకాశం ఉందని పేర్కొంది.
మరోవైపు ఉదయం వేళల్లో పొగమంచు ఎక్కువగా ఉంటుందని తెలిపింది. కాబట్టి ప్రయాణికులు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ వర్షాల ప్రభావం తగ్గిన తర్వాత, నవంబర్ 29 నుంచి రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

