సంపత్ ఆత్మహత్యపై విచారణ జరిపించాలి: ఏబీవీపీ

కలం, నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం విద్యార్థి చల్ల సంపత్ ఆత్మహత్య (IIIT Student Sampath Suicide) చేసుకోవడం అత్యంత బాధాకరమని ఏబీవీపీ (ABVP) ఇందూర్ విభాగ్ కన్వీనర్ కైరి శశిధర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన సంపత్ మృతిపై ప్రభుత్వం, యూనివర్సిటీ అధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సంపత్ కుటుంబానికి ఏబీవీపీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు.

బాసర ట్రిపుల్ ఐటీలో వరుసగా విద్యార్థుల ఆత్మహత్యలు చోటుచేసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. చదువుల ఒత్తిడి, ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రభావం, విద్యార్థుల సమస్యలను గుర్తించి పరిష్కరించే వ్యవస్థల లోపంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. సంపత్ మృతిపై ఉన్నతస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను నిషేధించాలని, ప్రతి హాస్టల్‌లో మానసిక నిపుణులతో కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు.

హాస్టళ్లలో పర్యవేక్షణ పెంచడంతో పాటు బాధిత కుటుంబానికి ప్రభుత్వం తగిన ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు సమస్యలు ఎదురైనప్పుడు ఆత్మహత్యకు పాల్పడకుండా తల్లిదండ్రులు, స్నేహితులు, సంబంధిత వ్యక్తులతో పంచుకోవాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>