భారత్‌పై భాటియా సెంచరీ.. అదిరిపోయే రివేంజ్‌!

క‌లం, స్పోర్ట్స్: భారత జట్టులో చోటు కోసం ఒకప్పుడు ప్రయత్నించిన బ్యాటర్.. ఇప్పుడు అదే భారత్ ఏపై సెంచరీతో మెరిశాడు. యూఏఈ తరఫున ఆడుతున్న హర్ ప్రీత్ సింగ్ భాటియా (Harpreet Singh Bhatia).. రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో తన సత్తా చాటాడు. భారత్ ఏతో జరిగిన మ్యాచ్‌లో 120 బంతుల్లో శతకం సాధించాడు. 11 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. హర్షిత్ రాణాను సిక్సర్ కొట్టి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భాటియా ఒకప్పుడు భారత అండర్-19 జట్టులో కీలక ఆటగాడు. 2008-09 కూచ్ బెహార్ ట్రోఫీలో 709 పరుగులు చేసి అండర్-19 బెస్ట్ క్రికెటర్ అవార్డు అందుకున్నాడు. 2009లో భారత అండర్-19 జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాడు.

2010 అండర్-19 ప్రపంచకప్‌లోనూ ఆడాడు. తర్వాత మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ జట్ల తరఫున దేశవాళీ క్రికెట్‌లో కొనసాగాడు. రంజీ, విజయ్ హజారే ట్రోఫీల్లోనూ మంచి ప్రదర్శన చేశాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా, పుణె, పంజాబ్ జట్లకు ఆడాడు. 2024లో చివరిసారిగా ఐపీఎల్‌లో కనిపించాడు. 2026లో యూఏఈ పౌరసత్వం పొందిన భాటియా.. ఆ దేశం తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఏప్రిల్‌లో టీ20, వన్డే అరంగేట్రం చేశాడు. ఈ టోర్నీలో పాకిస్థాన్ ఏపై 7, నేపాల్‌పై 32 పరుగులు చేసిన అతడు.. భారత్ ఏపై మాత్రం సెంచరీతో తన సుదీర్ఘ క్రికెట్ ప్రయాణంలో ప్రత్యేక ఘట్టాన్ని అందుకున్నాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>