కలం, వెబ్ డెస్క్: బిగ్ బాస్ సీజన్ -10 (Bigg Boss Telugu Season 10) ఫైనల్ కు దగ్గర పడుతుండటంతో ఎవరు గెలుస్తారన్నది ఉత్కంఠ మారుతోంది. బిగ్ బాస్ -10 దశావతారం భాగంగా ఫ్యాన్స్‌ను అలరించేందుకు ప్రతీవారం వినూత్న థీమ్‌తో ముందుకు వెళ్తున్నారు. 12వ వారానికి గాను సోమవారం వాడివేడిగా నామినేషన్లు ముగిశాయి. ప్రస్తుతం రామకృష్ణ, ముకేష్, వర్షిణి, శివ్, త్రిగుణ్, దేబ్జానీ, రామ్ ప్రసాద్ నామినేషన్లలో ఉన్నారు. ఈ వీక్ బడ్డీ అప్ థీమ్‌లో భాగంగా ఇమ్మాన్యుయేల్, సంజన హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ సీజన్ -9 లో తనదైన ముద్రవేసుకున్న ఇమ్మాన్యుయేల్, సంజన బిగ్ బాస్ ఇంట్లో సందడి చేశారు. ఇక ఎప్పటిలాగే తనదైన కామెడీ టైమింగ్ తో ఇమ్మాన్యుయేల్ హౌస్ మేట్స్ అందరిపై కౌంటర్లు వేశారు.
సంజనా, ఇమ్ము రాకతో హౌస్ మేట్స్ అందరూ సడన్ సర్ ప్రైజ్ అయ్యారు. అందరూ కలిసి డ్యాన్స్ చేస్తూ అలరించారు. అసలు ఎందుకు వచ్చారు? అని వర్షిణి నవ్వుతూ అడగగా.. ‘మీ ఇద్దరి లెక్కల గేమ్ చూశా’ అని వర్షిణీకి ఇమ్ము సెటైరికల్ కౌంటర్ వేశాడు. ఇక అందరినీ లివింగ్ ఏరియాలో కూర్చోబెట్టి ఇమ్మానుయేల్ ఒక్కొక్కరి రివ్యూ ఇచ్చారు.
ముకేష్ కాళ్లకి వర్షిణి నమస్కారం చేసిన సీన్‌ను ఇమ్ము రీ క్రియేట్ చేసి వాళ్ళను ఇమ్ము ఆటపట్టించారు. ఇక సుధీర్ రెడ్డిపై కూడా ఇమ్ము పంచులు వేశారు. ‘సుధీర్ అన్న.. నీతో పాటు అందరూ వెళ్తున్నారు.. నువ్వు మాత్రం రిటర్న్ వస్తున్నావ్’ అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. వంశీ, త్రిగుణ్ మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ బాండింగ్‌పై ఇమ్ము సరదాగా సెటైర్లు వేశాడు.
కామెడీ టైమింగ్, మింగ్ గేమ్ తో అలరించే నరేష్ పై కూడా ఇమ్ము ప్రశంసలు కురిపించారు. నరేష్ గురించి మాట్లాడుతూ.. చైతన్య, అఖిల్ తర్వాత నాగార్జున సర్ నరేష్‌ను కూడా అంతగా ప్రశంసించారని కొనియాడారు. ఆ ప్రశంసలు విన్న నరేష్ సైతం నిజంగానే తాను అంత బాగా చేశానా? అని ఆశ్చర్యపోయేవాడంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు.

