కార్తీక పౌర్ణమి.. కొండగట్టుకు భక్తజన సంద్రం!

కలం, జగిత్యాల: కార్తీక పౌర్ణమి, మంగళవారం ఒకేసారి రావడంతో జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు(Kondagattu) ఆంజనేయ స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే చుట్టుపక్కల గ్రామాలు, వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో కొండగట్టుకు చేరుకున్నారు. స్వామివారి నిజరూప దర్శనం కోసం భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో గిరిప్రదక్షిణ నిర్వహిస్తున్నారు.

భక్తుల రాకతో కొండగట్టుకు వెళ్లే రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. గిరిప్రదక్షిణ చేస్తూ భక్తులు చేస్తున్న ‘జై శ్రీరామ్.. జై హనుమాన్’ నినాదాలతో కొండగట్టు పరిసరాలు మారుమోగుతున్నాయి. కార్తీక పౌర్ణమి పర్వదినం, ఆంజనేయ స్వామి మంగళవారం కలిసి రావడంతో కొండగట్టు క్షేత్రం భక్తుల సందడితో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>