కలం, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) రీసెంట్గా పెద్దపల్లి జిల్లాలోని రామగిరి ఖిలాకు వెళ్లిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి నాలుగు గంటలు కారులో జర్నీ చేసి, కోటపైకి ట్రెక్కింగ్ చేసి చైతూ సైలెంట్‌గా మళ్లీ తిరుగు ప్రయాణమయ్యారు. తాను వెళ్లొచ్చే వరకు ఈ విషయం అక్కడి స్థానికులకు గానీ, మీడియాకు గానీ తెలియనేలేదు. కొత్త సినిమా షూటింగ్ లొకేషన్స్ వెతకడం కోసం చై అక్కడికి వెళ్లాడంటూ ప్రచారం జరిగింది.
కొంతమంది నెటిజన్లు మాత్రం త్వరలో రిలీజ్ కానున్న వృషకర్మ ప్రమోషన్ల కోసం వెళ్లాడంటూ చర్చించుకున్నారు. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు కానీ.. తాజాగా యూట్యూబర్ జస్తీ తన ఛానెల్లో చై(Naga Chaitanya)తో ట్రెక్కింగ్ చేసిన వీడియోను షేర్ చేసుకున్నారు. ఇది చూస్తుంటే వృషకర్మ ప్రమోషన్లో భాగంగా ట్రెక్కింగ్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ ట్రెక్కింగ్ సందర్భంగా చైతో జరిగిన సంభాషనలను జస్తీ తన ఇన్‌స్టా, యూట్యూబ్ వేదికగా షేర్ చేసుకున్నారు. చై అలవాట్లు, ఇష్టాలు, తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన ఎన్నో విషయాలపై మనసు విప్పి మాట్లాడారు. ఎప్పుడైనా ఏడ్చారా అంటూ జస్తీ అడిగి ప్రశ్నకు చై సమాధానమిస్తూ.. చాలాసార్లు ఏడవాలని ఉంటుందని, కానీ కళ్లల్లోంచి నీళ్లు రావని చెప్పారు. తన మనసులో ఎప్పుడూ ఎంతో బాధ ఉంటుందని అన్నారు. తను ఎక్కువ అమ్మ దగ్గరే పెరిగానని, తన దగ్గరే జీవితానికి సంబంధించి చాలా నేర్చుకున్నానని చెప్పారు. ఇంకా తనకు మ్యూజిక్ ఫెస్టివల్స్, రైడింగ్ అంటే చాలా ఇష్టమన్నారు. ఎఫ్ఎమ్ అంటే కూడా తనకు చాలా ఇష్టమన్నారు.
ఇంటర్నెట్ కాలంలో ఏదీ శాశ్వతం కాదని, ఒక వార్తను ఇంకో వార్త రీప్లేస్ చేస్తూనే ఉంటుందని అన్నారు. జీవితంలో తప్పు, ఒప్పు అంటూ ఏదీ లేదని, ఇదే తాను నమ్మే ఫిలాసఫీ అని చై తెలిపారు. లవ్ స్టోరీతో తనకు చాలా మంచి పేరు వచ్చిందన్నారు. వృషకర్మ గురించి మాట్లాడుతూ.. ట్రెషర్ హంటర్ అనే కాన్సెప్ట్ తనకు చాలా నచ్చిందని, అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానని చెప్పారు. రామగిరి ఖిలాపై జరిగిన ఈ ఫుల్ ఇంటర్వ్యూ నవంబర్ 27న విడుదల చేయనున్నట్లు జస్తీ తెలిపారు.
Also Read : సడన్ సర్ప్రైజ్.. బిగ్ బాస్ ఇంట్లో ఇమ్మాన్యుయేల్, సంజన సందడి
Follow Us On: Youtube

