కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ లోని బాచుపల్లి (Bachupally)లో మంగళవారం తీవ్ర విషాద ఘటన జరిగింది. సెప్టిక్ ట్యాంక్లో పడి ముగ్గురు కార్మికులు (Septic Tank Workers Death) మృతి చెందారు. సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. హెచ్.ఆర్ ఇన్వెస్టిస్ క్లీనింగ్ కంపెనీకి చెందిన ముగ్గురు కార్మికుల చనిపోయినట్లుగా తేల్చారు. మృతులను సుమన్ అలియాస్ షణ్ముఖ్ (24), సురేష్ (25), పవన్ (25)గా గుర్తించారు. మృతులంతా శ్రీకాకుళం జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. షణ్ముఖ లోపలికి దిగి శుభ్రం చేస్తుండగా.. బిగ్గరగా అరుపులు వినబడడంతో పవన్, సురేష్ లోపలికి దిగారు. ఈ క్రమంలోనే ఊపిరాడక ముగ్గురూ లోపలే మృతి చెందారు. ఈ విషాద ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

