రాజ్యాంగ దినోత్సవాన్ని విజయవంతం చేయాలి: రంజిత్

కలం, నిర్మల్: ఈ నెల 26న నిర్వహించనున్న రాజ్యాంగ దినోత్సవ వేడుకలను జిల్లా వ్యాప్తంగా విజయవంతం చేయాలని మాల మహానాడు కన్వీనర్ బత్తుల రంజిత్ (Mala Mahanadu Convenor Ranjith) పిలుపునిచ్చారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1949 నవంబర్ 26న రాజ్యాంగ ముసాయిదా కమిటీ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన చారిత్రాత్మక రోజును పురస్కరించుకుని ప్రతి సంవత్సరం రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో మాల సంఘం కమిటీల ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కోరారు.

నిర్మల్ (Nirmal) పట్టణంలోని ట్యాంక్ బండ్ వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం సమీపంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు రంజిత్ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి మాల సంఘం నాయకులు, కార్యకర్తలు, అంబేద్కర్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు వెంకటస్వామి, మురళీధర్, బోసు, రమేష్, పురుషోత్తం, భూమేష్, సతీష్, అశోక్, సుధాకర్, రాజేశ్వర్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>