గరివిడిలో విషాదం.. గెడ్డలో పడి ఇద్దరు చిన్నారులు మృతి

కలం, వెబ్ డెస్క్: విజయనగరం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గరివిడి(Garividi) మండలం వి.పి. రేగ గ్రామంలో గెడ్డలో పడి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

స్థానికుల కథనం ప్రకారం.. ఎర్రవెల్లి వర్ష (4), ఎర్రవెల్లి ధనుష్ (7) అనే ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు గ్రామ సమీపంలోని గెడ్డలో పడిపోయారు. ఈ ప్రమాదంలో నీటిలో మునిగి ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. అప్పటివరకు ఆడుతూ పాడుతూ కనిపించిన చిన్నారులు విగతజీవులుగా మారడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు మృత్యువాత పడటంతో గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తమ పిల్లలు తిరిగి వస్తారనే ఆశతో ఎదురుచూసిన తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>