స్కూల్ పిక్నిక్‌లో విషాదం.. ఉయ్యాల కిందపడి బాలుడు మృతి!

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ లోటస్ పాండ్ పార్కు (Lotus Pond Park) లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సరదాగా సాగాల్సిన స్కూల్ పిక్సిక్ కాస్తా ఓ చిన్నారి ప్రాణాలను బలిగొంది. పార్కులోని భారీ ఇనుప ఉయ్యాల కింద పడి 4వ తరగతి విద్యార్థి మృతిచెందగా, మరొక విద్యార్థి గాయపడ్డాడు.

వివరాల్లోకి వెళితే.. నార్సింగిలోని హ్యాపీ స్కాలర్స్ స్కూల్ యాజమాన్యం విద్యార్థులను లోటస్ పాండ్ పార్కుకు పిక్నిక్ కు తీసుకెళ్లింది. అక్కడ కొంతమంది పిల్లలు భారీ ఇనుప ఉయ్యాలపై కూర్చొని ఉండగా, మరికొందరు దాన్ని వేగంగా ఊపారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఉయ్యాల కింద పడిపోవడంతో 4వ తరగతి విద్యార్థి టి. అభిరామ్ (10) ముఖం, నడుము భాగాల్లో తీవ్ర గాయాలై మృతిచెందాడు. ఈ ప్రమాదంలో టీ. యశ్వంత్ (11) అనే మరో బాలుడు గాయపడ్డాడు. తమ కుమారుడి మృతికి స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని అభిరామ్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>