కౌశిక్ రెడ్డి వ్యవహారం.. 28న ఎథిక్స్ కమిటీ కీలక భేటీ!

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Kaushik Reddy) వ్యవహారశైలిపై కొనసాగుతున్న వివాదం మరో కీలక దశకు చేరుకుంది. గత బడ్జెట్ సమావేశాల సందర్భంగా సభలో సీనియర్ సభ్యుడు కడియం శ్రీహరి(Kadiyam Srihari)పై కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని, సభా మర్యాదలకు భంగం కలిగించారని వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో స్పీకర్ ఈ వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి నివేదించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేవూరి ప్రకాశ్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 28వ తేదీన ఉదయం 11 గంటలకు కమిటీ హాల్‌లో అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ ప్రత్యేకంగా సమావేశం కానుంది.

కాగా, గత సమావేశాల్లో కౌశిక్ రెడ్డి(Kaushik Reddy)కి నోటీసులు జారీ చేసి రాతపూర్వక వివరణ కోరడంతో పాటు, అసెంబ్లీలో జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి వీడియో ఫుటేజీని పరిశీలించాలని కమిటీ నిర్ణయించింది. అయితే కౌశిక్ రెడ్డి సైతం కమిటీ నిబంధనలు అధికార పక్షానికి కూడా సమానంగా వర్తించాలని వాదిస్తున్నారు. రాబోయే శాసనసభ సమావేశాల్లోపు ఈ విచారణపై తుది నివేదికను స్పీకర్‌కు సమర్పించాలని ఎథిక్స్ కమిటీ.. ఈ నెల 28న జరిగే భేటీలో కమిటీ సభ్యులు వీడియో ఆధారాలను, కౌశిక్ రెడ్డి ఇచ్చిన వివరణను లోతుగా విశ్లేషించనుంది. దీంతో కమిటీ చైర్మన్ రేవూరి ప్రకాశ్ రెడ్డి (Revuri Prakash Reddy) అధ్యక్షతన జరగనున్న ఈ భేటీపై రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది.

Also Read : కొత్త ఇన్‌చార్జి సందీప్‌తో కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీ!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>