కలం, వెబ్ డెస్క్ : రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బందనకల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యక్తిగత సహాయకుడు (KCR Attender) కస్తూరి మహేందర్ రెడ్డి అలియాస్ మణికుమార్ రెడ్డి ప్రాణాలు కోల్పోయారు. వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో మహేందర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భరత్ అనే మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
ఈ విషాదకర ఘటనపై సమాచారం అందుకున్న కేసీఆర్ దిగ్భ్రాంతికి లోనయ్యారు. వెంటనే జనగామ మాజీ ఎంపీపీ శరత్ రావుకు ఫోన్ చేసి ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన కేసీఆర్, బాధిత కుటుంబాలకు పార్టీ తరపున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

