హర్మూజ్ జలసంధిలో కల్లోలం.. చమురు ధరలు పెరిగే ఛాన్స్!

కలం, వెబ్ డెస్క్ : ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో (Strait of Hormuz) సైబర్ దాడులు దాడులు జరగడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఆయిల్, ఎల్పీజీ, కెమికల్ ట్యాంకర్ నౌకలను లక్ష్యంగా చేసుకుని సుమారు 50 ట్యాంకర్ నౌకల కంప్యూటర్ నెట్‌వర్క్‌లలోకి హ్యాకర్లు చొరబడ్డారు. కేవలం నౌకల వ్యవస్థలను స్తంభింపజేయడమే కాకుండా, సిబ్బందికి డబ్బులు డిమాండ్ చేస్తూ బెదిరింపు సందేశాలు పంపినట్లు తెలుస్తోంది. అమెరికా లేదా ఇజ్రాయెల్ ప్రయోజనాలకు మద్దతు ఇస్తే నౌకలను పేల్చివేస్తామంటూ బాంబు బెదిరింపులు కూడా జారీ చేసినట్లు అంతర్జాతీయ మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి.

అయితే ఈ సైబర్ దాడుల వెనుక ఇరాన్ హస్తం ఉందని అమెరికా అధికారులు బలంగా అనుమానిస్తున్నారు. అమెరికా దర్యాప్తు సంస్థలు ఈ ఘటనపై లోతుగా విచారణ జరుపుతుండగా, ఇరాన్‌తో పాటు రష్యా ప్రమేయంపై కూడా కోణాలను పరిశీలిస్తున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను సముద్ర మార్గాలు, డిజిటల్ నెట్‌వర్క్‌ల ద్వారా ప్రపంచ వాణిజ్యంపై ఒత్తిడి పెంచేందుకు టెహ్రాన్ ‘సైబర్ వార్’కు తెరలేపిందని వాషింగ్టన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఇదిలాఉంటే ప్రపంచ చమురు వినియోగంలో దాదాపు ఐదవ వంతు హర్మూజ్ జలసంధి ద్వారానే సరఫరా అవుతుంది. ఈ సైబర్ ముప్పు కారణంగా సరుకు రవాణా బీమా ఖర్చులు భారీగా పెరిగే ప్రమాదం ఏర్పడింది. సైబర్ దాడులు ఇలాగే కొనసాగితే లేదా అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం ఉధృతమైతే అంతర్జాతీయ సరఫరా గొలుసు దెబ్బతిని, అన్ని దేశాలలో చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి దీనిపై అగ్రరాజ్యం అమెరికా ఏ విధంగా స్పందిస్తుందనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>