కలం, వెబ్ డెస్క్ : ఎన్విడియా సంస్థ సీఈఓ జెన్సన్ను బలవంతంగా పదవి నుంచి తప్పించడాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకించానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ (KA Paul) తెలిపారు. ఈ విషయంపై తాను వెంటనే స్పందించి గళం విప్పడంతో ఎలాన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్, మైక్ జాన్సన్ వంటి ప్రముఖులు మద్దతుగా నిలిచారని ఆయన పేర్కొన్నారు.
మనం గట్టిగా పూనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని ఆయన స్పష్టం చేశారు. ఇదే స్ఫూర్తితో డీలిమిటేషన్, ఎఫ్సీఆర్ఏ (FCRA) సహా ఇతర అక్రమ బిల్లులను మనమంతా కలసికట్టుగా అడ్డుకోవచ్చని కేఏ పాల్ పిలుపునిచ్చారు.

