కలం, వెబ్ డెస్క్: తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. మంగళవారం తెల్లవారుజామున ఆలయ పరిసరాలతో పాటు మాడవీధుల్లో మంచు కురవడంతో ఆ ప్రాంతమంతా ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. పొగమంచుతో తిరుమల కొండలు ప్రకృతి అందాలతో కనువిందు చేశాయి. మరోవైపు మంచు ప్రభావంతో ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. ఉదయం వేళ ఆలయ పరిసరాలు మంచు తెరలతో అందంగా కనిపించడంతో భక్తులు ఈ ప్రకృతి అందాలను ఆస్వాదించారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు చలి నుంచి రక్షణ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు.

