హామీలపై నిలదీత.. గ్రామస్తుడిపై కడియం శ్రీహరి అనుచరుల దాడికి యత్నం!

కలం, వెబ్‌ డెస్క్‌ : జనగామ జిల్లా జాఫర్‌గడ్ మండలం ఉప్పుగల్లు (Uppugallu) గ్రామంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరికి (MLA Kadiyam Srihari) నిరసన సెగ తగిలింది. ఎన్నికల సమయంలో గ్రామానికి ఇచ్చిన హామీల అమలుపై ఓ గ్రామస్తుడు ప్రశ్నించడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది . గ్రామంలో గత మూడేళ్లుగా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని ఆరోపిస్తూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని సదరు గ్రామస్తుడు కడియం శ్రీహరిని నిలదీశాడు. గ్రామ సమస్యలను పరిష్కరించడంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

దీంతో ఎమ్మెల్యే అనుచరులు ఆ గ్రామస్తుడిపై దాడికి యత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కడియం శ్రీహరి (Kadiyam Srihari) ఈ విషయాన్ని తర్వాత మాట్లాడుకుందామని చెబుతూ అక్కడి నుంచి దాటవేసినట్లు సమాచారం. గ్రామ అభివృద్ధిపై ప్రశ్నించిన వ్యక్తిపై దాడికి యత్నించారనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల హామీల అమలుపై ప్రజలు నిలదీస్తుండటంతో ఈ ఘటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

Also Read : డిసెంబర్ 16న బంగ్లాకు పయనం.. హసీనా ప్రకటనతో రాజకీయ ఉత్కంఠ!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>