కలం, వెబ్ డెస్క్ : నేడు తెల్లవారుజామున నేపాల్‌లోని (Nepal Earthquake) కోషి ప్రావిన్స్ పరిధిలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై ఈ భూకంప తీవ్రత 5.3గా నమోదైనట్లు యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ వెల్లడించింది. భారత్-నేపాల్ సరిహద్దుల్లోని సిక్కిం సమీపంలో, నేపాల్‌లోని తాప్లేజంగ్ జిల్లా ప్రాంతానికి దగ్గరగా, భూఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు ఈ సంస్థ గుర్తించింది.
ఈ భూకంప ప్రభావంతో తూర్పు నేపాల్‌లోని పలు జిల్లాలతో పాటు భారత్‌లోని సిక్కిం, పశ్చిమ బెంగాల్ (డార్జిలింగ్, ఉత్తర బెంగాల్ ప్రాంతాలు), బిహార్ రాష్ట్రాల్లోని సరిహద్దు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించిందని భారత జాతీయ భూకంప అధ్యయన కేంద్రం తెలిపింది. ఉదయాన్నే ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ఆందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రస్తుతానికి ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం గానీ, భారీ ఆస్తి నష్టం గానీ జరిగినట్లు అధికారిక సమాచారం అందలేదు.

