ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న సోన్ గోదావరి తీరం!

కలం, సోన్ : కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని సోన్ మండల కేంద్రంలోని గోదావరి నది (Godavari River Soan) భక్తులతో కిటకిటలాడింది. సోమవారం వేకువజాము నుంచే నిర్మల్ తో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో గోదావరి తీరానికి చేరుకున్నారు.

పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి, భక్తిశ్రద్ధలతో కార్తీక దీపాలను వెలిగించి నదిలో వదిలారు. మట్టితో శివలింగాలను రూపొందించి, దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరి తీరమంతా దీపాల వెలుగులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా పూజలు నిర్వహించిన భక్తులు శివుడిని వేడుకుంటూ తమ కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>