కలం, దిలావర్పూర్: కార్తీక పౌర్ణమి(Karthika Pournami) పురస్కరించుకుని దిలావర్పూర్ మండలం సాంగ్వి గ్రామంలోని శ్రీశ్రీశ్రీ మాతా అన్నపూర్ణేశ్వరి ఆలయం సమీపంలో గోదావరి నది తీరాన ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శివుడికి భక్తిశ్రద్ధలతో రుద్రాభిషేకం నిర్వహించి, అనంతరం గంగా హారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన మహిళలు, యువత, భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గోదావరి తీరాన భక్తిపారవశ్యంతో సాగిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.

