కార్తీక రెండవ సోమవారం.. గోదావరిలో ఘనంగా నదీ హారతులు!

కలం, ఖమ్మం బ్యూరో: ​కార్తీక మాసం రెండవ సోమవారం సందర్భంగా భద్రాచలం (Bhadrachalam)లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థాన అనుబంధ ఆలయమైన శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం నుండి సోమవారం సాయంత్రం 5:30 గంటలకు గోదావరి నదిలో నదీ హారతులను ఘనంగా నిర్వహించారు. ​కార్తీక సోమవారం ప్రాశస్త్యాన్ని పురస్కరించుకుని శివాలయం నుండి ఆలయ అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో గోదావరి తీరానికి చేరుకుని నదీమాతకు ప్రత్యేక పూజలు, హారతులు సమర్పించారు.

వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, శంఖనాదాలు, దీపకాంతుల నడుమ సాగిన ఈ నదీ హారతి కార్యక్రమంతో గోదావరి తీరం ఆధ్యాత్మిక శోభతో పులకించిపోయింది. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని, నదీమాతను భక్తిశ్రద్ధలతో దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంతో పరిసర ప్రాంతాల్లో భక్తిపారవశ్యం నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>