కలం, మెదక్ బ్యూరో: అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు న్యాయం చేయాలనే లక్ష్యంతో, వారి వద్ద ఉన్న ఒరిజినల్ బాండ్లు, నగదు రసీదులు, ఇతర సంబంధిత పత్రాల ధృవీకరణ, నమోదు ప్రక్రియ కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ (SP Paritosh Pankaj) తెలిపారు. ఇందులో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లా (మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట) పరిధిలోని అగ్రిగోల్డ్ బాధితులు, డిపాజిటర్లు, చట్టబద్ధ వారసులు, ఏజెంట్లు ఈ నెల 25.11.2026 నుంచి నిర్దేశించిన తేదీల్లో తమకు సంబంధించిన ధృవీకరణ పత్రాలతో మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో హాజరుకావాలని కోరారు.
ఈ ధృవీకరణ ప్రక్రియ పని దినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. కావున అగ్రిగోల్డ్ బాధితులు, డిపాజిటర్లు, ఏజెంట్లు తమకు కేటాయించిన తేదీల్లో అవసరమైన అన్ని ఒరిజినల్ పత్రాలు, వాటి జిరాక్స్ కాపీలతో మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయానికి హాజరై ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఎస్పీ సూచించారు.

