బాలికల సాధికారతే లక్ష్యంగా అవగాహన సదస్సు

కలం, నిర్మల్: బాలికలు తమ హక్కులు, చట్టాలు, వ్యక్తిగత భద్రతపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి దయానంద్ సూచించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రియదర్శినగర్‌లో ఉన్న షెడ్యూల్డ్ కులాల కళాశాల బాలికల వసతి గృహంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని మహిళా సాధికారత కేంద్రం ద్వారా బేటీ బచావో.. బేటీ పడావో (Beti Bachao Beti Padhao) పథకంపై సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సాధికారత కేంద్రం సిబ్బంది బాలికలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. బాలికల విద్య ప్రాముఖ్యత, మహిళా సాధికారత, బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాలు, బాల్యవివాహాల నిరోధక చట్టం, గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నిషేధ చట్టం గురించి వివరించారు.

అలాగే సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన సమయంలో సఖి, చైల్డ్ హెల్ప్‌లైన్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. గుడ్ టచ్.. బ్యాడ్ టచ్, లింగ వివక్షత, ఋతుక్రమ పరిశుభ్రత వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఏదైనా సమస్య ఎదురైతే భయపడకుండా సంబంధిత అధికారులను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వసతి గృహ సంక్షేమ అధికారులు పల్లవి, సౌమ్య, మహిళా సాధికారత కేంద్రం జెండర్ స్పెషలిస్టులు జ్యోతి, మౌనిక, భరోసా కేంద్రం లీగల్ ఆఫీసర్ అర్చన, షీ టీం పోలీస్ కానిస్టేబుల్ విజయలక్ష్మి, విద్యార్థినులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>