‘తల్లి నా ఆదిలాబాద్’ గీతానికి కలెక్టర్ ప్రశంసలు

కలం, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ప్రకృతి అందాలు, అటవీ సంపద, ఆధ్యాత్మిక క్షేత్రాలు, సంస్కృతి సంప్రదాయాలు, స్థానిక కళాకారుల ప్రతిభను ప్రతిబింబించేలా రూపొందించిన ‘తల్లి నా ఆదిలాబాద్.. అడవి తల్లి జిల్లా’ వీడియో గీతాన్ని(Thalli Na Adilabad) జిల్లా కలెక్టర్ రాజర్షి షా సోమవారం జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఆవిష్కరించి తిలకించారు. జిల్లా కళాకారులు, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు సంయుక్తంగా రూపొందించిన ఈ వీడియో గీతం ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేకతను, ప్రకృతి రమణీయతను, అటవీ వైభవాన్ని ప్రజలకు పరిచయం చేసేలా ఉందని కలెక్టర్ ప్రశంసించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లా ప్రకృతి సౌందర్యానికి, అపారమైన అటవీ సంపదకు, చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశాలకు, విభిన్న సంస్కృతి సంప్రదాయాలకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. జిల్లాలోని సహజ వనరులు, పర్యాటక ప్రదేశాలు, స్థానిక కళలు, సంస్కృతి వైభవాన్ని వీడియో గీతం రూపంలో ప్రజలకు పరిచయం చేయడం అభినందనీయమని అన్నారు. వీడియో గీతం రూపకల్పనలో భాగస్వాములైన కళాకారులందరినీ కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాజేశ్వర్, ఆర్.ఎస్. చిత్రు, డీపీఆర్ఓ విష్ణువర్ధన్, కళాకారులు దత్తు, రవి, వెంకట్రావు, గోవింద్, శంకర్, రాజలింగు, మురళి, ఆశిష్, నర్సమ్మ, మోహన్ నాయక్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>