కలం, ఎర్రుపాలెం: మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండలం జమలాపురంలో సోమవారం గ్రామ సర్పంచ్ తుళ్ళూరి నిర్మల కుమారి అధ్యక్షతన గ్రామపంచాయతీ కార్యాలయం నందు ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని మధిర (Madhira) వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ప్రతి కుటుంబానికి కుటుంబ యజమాని పేరుతో ఐదు లక్షల రూపాయలు జీవిత బీమా పొందే విధంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు ఈ పథకాన్ని అందరూ నమోదు చేయించుకోవాలని తెలియజేశారు. అంతేకాకుండా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమం దిశగా ముందుకు తీసుకు వెళుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో సెక్రటరీ కుమార్,జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి,గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు టి వెంకట్రామిరెడ్డి, క్లస్టర్ ఇంచార్జిలు యన్నం పిచ్చిరెడ్డి, గుడేటి బాబురావు, వెంకటాపురం సర్పంచ్ బొగ్గుల గోవర్ధన్ రెడ్డి, బాణావత్ శ్రీను, అంకసాల శ్రీనివాసరావు, నన్నపనేని రామారావు, వేమిరెడ్డి అంకిరెడ్డి, శ్యామ్, మురళి, సగ్గుర్తి వెంకటనారాయణ, దేవరకొండ రాజీవ్ గాంధీ, షేక్ జానీ భాష, షేక్ ఫరూక్ తదితరులు పాల్గొన్నారు.

