కేసీఆర్‌ హ‌యాంలోనే ప‌ల్నాడు ప్రాజెక్టుకు బీజం: సీఎం రేవంత్‌

క‌లం, వెబ్‌డెస్క్‌: నాగార్జున సాగర్‌ నుంచి ఏపీకి నీటిని తరలించే కుట్రలకు గత బీఆర్‌ఎస్‌ హయాంలోనే బీజం పడిందని సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ప‌ల్నాడు ప్రాజెక్ట్‌ (Palnadu Project) విష‌యంలో బీఆర్ఎస్ నాయ‌కులు చేస్తున్న ఆరోప‌ణ‌ల‌ను తిప్పికొడుతూ సీఎం రేవంత్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ మేర‌కు నేడు స‌చివాల‌యంలో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో నాటి సీఎం జగన్‌ హయాంలో 2022 ఫిబ్రవరి 16న పల్నాడు డ్రింకింగ్‌ వాటర్‌ సప్లై పేరుతో రూ.1,200 కోట్ల ప్రాజెక్టుకు జీవో నెం. 56 విడుదలైంద‌న్నారు. అప్పుడు తెలంగాణ సీఎంగా, ఇరిగేషన్‌ మంత్రిగా ఉన్న కేసీఆర్‌ 20 నెలల పాటు ఎందుకు మౌనం వహించారని ప్ర‌శ్నించారు. తెలంగాణ‌కు న‌ష్టం జ‌రుగుతుంద‌ని తెలిసినా కృష్ణా బోర్డుకు ఎందుకు ఫిర్యాదు చేయ‌లేద‌ని నిల‌దీశారు.

కేంద్ర జల్‌జీవన్‌ మిషన్‌, 15వ ఫైనాన్స్‌ కమిషన్‌ నిధులతో చేపట్టిన ఈ ప్రాజెక్టును ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం అమరజీవి జలధారగా రీడిజైన్‌ చేసి పనులు వేగవంతం చేసిందని పేర్కొన్నారు. తెలంగాణ నీటి హక్కులకు న‌ష్టం క‌లిగేలా నాడు ఏపీకి పూర్తి స్వేచ్ఛనిచ్చింది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని వ్యాఖ్యానించారు. ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై హ‌రీశ్ రావు, కేటీఆర్ బుర‌ద జ‌ల్లుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు త‌మ‌పై లేనిపోని ఆరోప‌ణ‌లు చేస్తూ రాజ‌కీయ ల‌బ్ధి పొందాల‌ని చూస్తున్నార‌ని మండిప‌డ్డారు.

ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ నేతలంతా అభివృద్ధి ప‌నుల్లో బిజీగా ఉంటే బీఆర్ఎస్ నేత‌లు అబ‌ద్ద‌పు ప్ర‌చారాల‌తో ప్ర‌జ‌ల్ని త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌న్నారు. మీడియా సైతం ఆధారాల‌ను ప‌రిశీలించ‌కుండా ఎవ‌రూ ఏం మాట్లాడినా పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తూ ప‌రోక్షంగా అబ‌ద్ధాల‌కు, అపోహ‌ల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్తున్నార‌న్నారు. 17,989 కోట్ల రూపాయ‌ల‌తో 13 జిల్లాల‌కు తాగు నీటి కోసం జీవో నెం.56 తెచ్చార‌న్నారు. గుంటూరు జిల్లాలోని ప‌ల్నాడు ఏరియాకు 1200 కోట్ల అంచ‌నాల‌తో, 200 కోట్లు కేంద్రం జ‌ల్ జీవ‌న్ మిష‌న్ ప‌థ‌కంలో భాగంగా ఇచ్చేలా జీవోలో పేర్కొన్నార‌ని తెలిపారు.

కేసీఆర్‌, జ‌గ‌న్ మ‌ధ్య స‌త్సంబంధాల కార‌ణంగానే ఈ జీవో సాధ్య‌మైంద‌ని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. జ‌గ‌న్ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు వ‌చ్చార‌ని, కేసీఆర్ రాయ‌ల‌సీమ‌కు వెళ్లార‌ని, ఇద్ద‌రూ విందు భోజ‌నాలు చేసుకున్నార‌ని విమ‌ర్శించారు. ఈ ప్రాజెక్టుకు స‌హ‌క‌రించొద్ద‌ని కేంద్రాన్ని కూడా కేసీఆర్ కోర‌లేద‌న్నారు. నాడు కేసీఆర్ ఇచ్చిన అనుమ‌తులు, అలుసుతోనే ప్రాజెక్టు నేడు ఈ స్థాయికి వ‌చ్చింద‌న్నారు. కేసీఆర్ హ‌యాంలో ప్రాజెక్టు పూర్త‌వ‌దేమోన‌న్న అనుమానంతో, రాబోయే ప్ర‌భుత్వాల‌తో ఇబ్బందులు రావొద్ద‌న్న ఆలోచ‌న‌తో జ‌గ‌న్ ముందు జాగ్ర‌త్త‌గా జీవో జారీ చేశార‌ని వెల్ల‌డించారు.

పేపర్ ఇమేజ్ పై క్లిక్ చేసి ఫుల్ స్టోరీ చదవండి

Palnadu Project
Palnadu Project

Also Read : హే పప్పూ.. ఢిల్లీలో ఉన్నది నిప్పు.. బండి సంజయ్ ఫైర్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>