మంత్రులపై ఆగ్రహం.. హై కమాండ్‌కు ఫిర్యాదు!

కలం, వెబ్ డెస్క్: మంత్రులు తమకు సరైన గౌరవం ఇవ్వడం లేదంటూ 25 మంది డీసీసీ అధ్యక్షులు (DCC Presidents) అత్యవసరంగా భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌లోని ఒక హోటల్‌లో సమావేశమైన వీరంతా.. కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలపై చర్చించుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమను కనీసం గుర్తించడం లేదని వాపోయారు. పార్టీ, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు తమకు సమాచారం ఇవ్వకుండానే జరిపిస్తున్నారని ఆరోపించారు.

ప్రోటోకాల్ ఎక్కడ..?

తాము డీసీసీ అధ్యక్షులుగా నియామకై ఏడాదవుతున్నా.. అందుకు సంబంధించిన ప్రోటోకాల్ కూడా ఇవ్వడం లేదని డీసీసీ అధ్యక్షులు (DCC Presidents) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా.. సమస్య పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు హైకమాండ్ దూత, రాష్ట్ర ఏఐసీసీ ఇన్‌ఛార్జిగా నియమితులైన బీఎం.సందీప్‌కు (BM Sandeep) ఫిర్యాదు చేశారు. దీనిపై పీసీసీ అధ్యక్షుడు, సీఎంతో చర్చిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం, ఆయా జిల్లాల్లో తాజా రాజకీయ పరిస్థితులపై బీఎం.సందీప్ వారితో సమీక్ష చేశారు.

Also Read : సీఎం రేవంత్ రాహుల్ గాంధీకి ఏటీఎం: నితిన్ న‌బీన్‌

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>