సీఎం రేవంత్ రాహుల్ గాంధీకి ఏటీఎం: నితిన్ న‌బీన్‌

క‌లం, వెబ్‌డెస్క్‌: కాంగ్రెస్ పార్టీ చొరబాటుదారుల ఓట్ల కోసమే పోరాటం చేస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ (Nitin Nabin) విమర్శించారు. కరీంనగర్‌లో స‌ర్‌ (SIR) కు మద్దతుగా బీజేపీ ఆధ్వ‌ర్యంలో నిర్వహించిన మ‌హా పాదయాత్ర(Maha Padayatra)లో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశవ్యాప్తంగా 13 కోట్ల ఓట్లు తొలగించామని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారని, అయితే మరణించిన మూడు కోట్ల మంది ఓటర్ల పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించకూడదా అని ప్రశ్నించారు. భారత ఆర్థిక వ్యవస్థపై కాంగ్రెస్ నేతలు అనవసరంగా రాద్ధాంతం వ్యక్తం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు దేశ ప్రయోజనాల కంటే రాజకీయాలు, కుటుంబ ప్రయోజనాలే ముఖ్యమని విమర్శించారు. రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని తిరుగుతున్నారని, రాజ్యాంగం బీజేపీ పార్టీ మనసులోనే ఉందని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ అవినీతి పార్టీ అని ప్రజలు గుర్తించారని, గతంలో అవినీతి కారణంగానే బీఆర్ఎస్‌ను ప్రజలు అధికారానికి దూరం చేశారని నితిన్ నబీన్ (Nitin Nabin) అన్నారు. బీజేపీకి ప్రజల మద్దతు ఉందని, ప్రజలు తమ వెంటే ఉన్నారని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి ఏటీఎంలా వ్యవహరిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. మూడేళ్ల‌లోనే రాష్ట్రాన్ని దోచుకున్నార‌ని వ్యాఖ్యానించారు. ఈ పాదయాత్రలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో పాటు పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్ రావు, కేంద్ర మంత్రులు కిష‌న్ రెడ్డి, బండి సంజ‌య్‌, పార్టీ రాష్ట్ర ముఖ్య నేత‌లు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Also Read : ‘వారికి పదవులు దక్కాలి’.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>