పెండింగ్ ప్రాజెక్టుల పూర్తిపై ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోపు పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సాగునీటి ప్రాజెక్టులను (Irrigation Projects) పూర్తి చేయలేదని ఆరోపించారు. పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, ఎస్ఎల్‌బీసీ, డిండి తదితర ప్రాజెక్టులను పెండింగ్ లో పెట్టిందన్నారు. బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తల కష్టం, త్యాగాల వల్లే రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిందని వారికి తగిన గుర్తింపు దక్కాలన్నారు. పార్టీలో దీర్ఘకాలంగా పనిచేసిన వారికి న్యాయం జరగాలని మంత్రి అభిప్రాయపడ్డారు.

మూడేళ్ల కాంగ్రెస్ పాలన విజయవంతంగా కొనసాగుతోందన్న ఉత్తమ్.. రాబోయే ఎన్నికల్లోనూ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 2024–2034 వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే కొనసాగాలన్న లక్ష్యంతో పనిచేయాలని కార్యకర్తలకు మంత్రి (Uttam Kumar Reddy) పిలుపునిచ్చారు. ఒకే నియోజకవర్గం నుంచి ఒకే పార్టీ తరఫున వరుసగా ఏడుసార్లు గెలిచిన అనుభవం తనకు ఉందని తెలిపారు. తెలంగాణ ప్రజలు, రైతుల కోసం నిరంతరం పని చేస్తుందని చెప్పారు. సాగునీటి రంగం చరిత్రంలో ఎన్నడూ లేనంతగా కృష్ణా, గోదావరి జలాల వినియోగించుకున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలోనే అత్యధిక వ్యవసాయ విస్తీర్ణం నమోదయిందన్నారు. అలాగే, అత్యధికంగా వరి ఉత్పత్తి, ధాన్యం సేకరణ కూడా తమ ప్రభుత్వంలోనే జరిగిందని ఉత్తమ్ వివరించారు.

Also Read : రైతులపై ప్రభుత్వ బ్యాంకులు చిన్నచూపు.. రుణాలపై నిర్లక్ష్యం!

Follow Us On : WhatsApp

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>