ఎమ్మెల్యే చొరవతో మూడు గ్రామాలకు మళ్లీ ఆర్టీసీ బస్సు సౌకర్యం

కలం, వనపర్తి: కరోనా సమయంలో నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు సర్వీసు మళ్లీ అందుబాటులోకి వచ్చింది. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి(Thudi Megha Reddy) ప్రత్యేక చొరవతో మోజర్ల, మద్దిగట్ల, అమ్మపల్లి గ్రామాలకు బస్సు సౌకర్యాన్ని పునరుద్ధరించారు. దీంతో ఆయా గ్రామాల ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. బస్సు సర్వీసు పునఃప్రారంభంతో విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులకు ప్రయాణ ఇబ్బందులు తొలగనున్నాయి. బస్సు సౌకర్యం కల్పించేందుకు కృషి చేసిన ఎమ్మెల్యేకు మూడు గ్రామాల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>