కలం, వెబ్ డెస్క్: డబ్బు వ్యామోహం మానవ సంబంధాలు మంట కలుపుతోంది. రక్త సంబంధాన్ని సైతం మరిచి కొందరు దారుణాలు ఒడిగడుతున్నారు. కన్నవారిని, కనిపెంచిన వారిని కూడా కనికరం లేకుండా కడేతేర్చుతున్నారు. ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లో జరిగింది. ఆస్తి వివాదంలో కారణంగా ఓ కొడుకు కన్న తండ్రిని దారుణంగా హత్య చేశాడు.
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లోని బాలాఘాట్ జిల్లాలో లాంజీ పోలీస్ స్టేషన్ పరిధిలో డుడేశ్వర్ ఖోబ్రాగడే (80) తన ఆస్తిలో భాగాన్ని కుమార్తెకు ఇచ్చాడు. దీంతో కొడుకు అనిల్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడు. ఈ కారణంగా తరచూ తండ్రితో గొడవ పడుతుండే వాడు. అంతే కాకుండా పింఛన్ డబ్బుల గురించి కూడా వేధించే వాడు. ఈ క్రమంలో తండ్రిపై కోపం పెంచుకున్న అనిల్.. వృద్ధుడిని తాళ్లతో కట్టి పెట్రోల్ పోసి నిప్పంటించడంతో సజీవదహనం అయ్యాడు.
మరుసటి రోజు కుటుంబ సభ్యులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారించగా అనిల్ నిజం ఒప్పుకున్నారు. ఆస్తి కోసం తండ్రిని చంపినట్లు అంగీకరించాడు.

