‘వారికి పదవులు దక్కాలి’.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఎటువంటి వ్యతిరేకత లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) అన్నారు. రాష్ట్ర నూతన ఇంచార్జ్ సందీప్ కుమార్ తో భేటీ కానున్న వేళ మంత్రి కోమటి రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 90 స్థానాలకు పైగా గెలవడం ఖాయమని, తాను రూపొందించిన వ్యూహం ప్రకారం వెళ్తే ఏకంగా 100 సీట్లకు పైగా విజయం సాధిస్తామని జోస్యం చెప్పారు. అలాగే, పార్టీ కోసం కష్టపడి పనిచేసే నిజమైన కార్యకర్తలకు తగిన పదవులు దక్కేలా రాష్ట్ర పార్టీ ఇంచార్జ్ తో ప్రత్యేకంగా చర్చిస్తానని స్పష్టం చేశారు.

మరోవైపు తెలంగాణ అభివృద్ధి విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. అసలు కేంద్రం నుంచి తెలంగాణకు ఏం సాధించారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రానికి వస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తెలంగాణకు కేంద్రం చేసిన మేలేంటో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు అంశాన్ని ప్రస్తావిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం తరపున 96 శాతం భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసినప్పటికీ కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపకుండా ఎందుకు పెండింగ్‌లో పెట్టిందో బీజేపీ నేతలు వివరించాలని కోమటిరెడ్డి నిలదీశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>