కలం, వెబ్ డెస్క్: కేఆర్ఎంబీ(KRMB)కి వినతిపత్రం ఇవ్వడానికి హైదరాబాద్ కు వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్టులు చేయడంపై ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (Jagadish Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రజల పక్షాన నిలబడేందుకు వెళ్తుంటే అడ్డుకోవడం సరికాదన్నారు. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలను పోలీసులు అక్రమంగా అరెస్ట్, హౌస్ అరెస్ట్ చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ ఎస్ నేతలను ఎందుకు అరెస్ట్ చేసారో డీజీపీ సమాధానం చెప్పాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు.
అనుమతులు లేకుండా నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) వద్ద ఏపీ ప్రభుత్వం దొంగతనంగా అక్రమ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతోందని జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఈ అక్రమ నిర్మాణాల వల్ల హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలకు తాగు, సాగునీటి ముప్పు పొంచి ఉందన్నారు. ఏపీ జల దోపిడిపై కేఆర్ఎంబీకి విజ్ఞాపన పత్రం అందజేసేందుకు వెళ్తుంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ఆయన (Jagadish Reddy) ప్రశ్నించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు లొంగిపోయిందని జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు.
Also Read : “న్యూ ఇయర్ తరువాత యుద్ధమే”.. ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్!
Follow Us On : WhatsApp

