అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు సీపీ గౌష్ ఆలం కీలక సూచనలు

కలం, కరీంనగర్ బ్యూరో: అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు ఊరటనిస్తూ అసలు బాండ్లు, నగదు రసీదుల ధృవీకరణ, నమోదు ప్రక్రియను (AgriGold bond verification) నవంబర్ 25, 2026 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు తెలంగాణ నేర పరిశోధన విభాగం (సీఐడీ) తెలిపింది. ఇందులో భాగంగా కరీంనగర్‌లోనూ ప్రత్యేక ధృవీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఒక ప్రకటనలో వెల్లడించారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల బాధితుల కోసం అల్కాపురి కాలనీ, కరీంనగర్-సిరిసిల్ల బైపాస్ రోడ్డు, డీర్ పార్క్ పక్కన, ఎన్టీఆర్ విగ్రహం సమీపంలోని సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ (సీటీసీ)లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పని దినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ధృవీకరణ ప్రక్రియ కొనసాగుతుంది.

ఫిబ్రవరి 2 వరకు మండలాల వారీగా షెడ్యూల్

కరీంనగర్ కేంద్రంలో నవంబర్ 25, 2026 నుంచి ఫిబ్రవరి 2, 2027 వరకు మండలాల వారీగా ధృవీకరణ జరుగుతుంది. రోజుకు గరిష్టంగా 250 ఖాతాలను పరిశీలిస్తారు.

నవంబర్:
  • నవంబర్ 25: బీర్పూర్ (246), ధర్మపురి (4)
  • నవంబర్ 26: ధర్మపురి (250)
  • నవంబర్ 27: ధర్మపురి (13), ఎండపల్లి (237)
  • నవంబర్ 28: ఎండపల్లి (14), గొల్లపల్లి (236)
  • నవంబర్ 30: గొల్లపల్లి (14), ఇబ్రహీంపట్నం (236)
డిసెంబర్:
  • డిసెంబర్ 1: ఇబ్రహీంపట్నం (12), కథలాపూర్ (238)
  • డిసెంబర్ 2: కథలాపూర్ (11), కోరుట్ల (239)
  • డిసెంబర్ 3: కోరుట్ల (8), మల్యాల (242)
  • డిసెంబర్ 4: మల్యాల (32), మల్లాపూర్ (218)
  • డిసెంబర్ 5: మల్లాపూర్ (73), మేడిపల్లి (177)
  • డిసెంబర్ 7: మేడిపల్లి (75), మెట్‌పల్లి (175)
  • డిసెంబర్ 8: మెట్‌పల్లి (97), పెగడపల్లి (153)
  • డిసెంబర్ 9: పెగడపల్లి (126), సారంగాపూర్ (124)
  • డిసెంబర్ 10: సారంగాపూర్ (122), వెల్గటూర్ (128)
  • డిసెంబర్ 11: వెల్గటూర్ (142), చిగురుమామిడి (108)
  • డిసెంబర్ 14: చిగురుమామిడి (157), చొప్పదండి (93)
  • డిసెంబర్ 15: చొప్పదండి (162), గంగాధర (88)
  • డిసెంబర్ 16: గంగాధర (160), గన్నేరువరం (90)
  • డిసెంబర్ 17: గన్నేరువరం (157), హుజూరాబాద్ (93)
  • డిసెంబర్ 18: హుజూరాబాద్ (220), జమ్మికుంట (30)
  • డిసెంబర్ 19: జమ్మికుంట (250)
  • డిసెంబర్ 21: జమ్మికుంట (51), కరీంనగర్ (199)
  • డిసెంబర్ 22: కరీంనగర్ (48), మానకొండూర్ (202)
  • డిసెంబర్ 23: మానకొండూర్ (80), రామడుగు (170)
  • డిసెంబర్ 24: రామడుగు (114), శంకరపట్నం (136)
  • డిసెంబర్ 28: శంకరపట్నం (132), తిమ్మాపూర్ (118)
  • డిసెంబర్ 29: తిమ్మాపూర్ (200), వి.సైదాపూర్ (50)
  • డిసెంబర్ 30: వి.సైదాపూర్ (201), వీణవంక (49)
  • డిసెంబర్ 31: వీణవంక (205), ధర్మారం (45)
జనవరి 2027:
  • జనవరి 1: ధర్మారం (217), జూలపల్లి (33)
  • జనవరి 2: జూలపల్లి (246), కమాన్‌పూర్ (4)
  • జనవరి 4: కమాన్‌పూర్ (250)
  • జనవరి 5: కమాన్‌పూర్ (250)
  • జనవరి 6: కమాన్‌పూర్ (70), మంథని (180)
  • జనవరి 7: మంథని (154), ముత్తారం (96)
  • జనవరి 8: ముత్తారం (213), ఓదెల (37)
  • జనవరి 11: ఓదెల (242), పెద్దపల్లి (8)
  • జనవరి 12: పెద్దపల్లి (250)
  • జనవరి 14: పెద్దపల్లి (100), రామగిరి (150)
  • జనవరి 16: రామగిరి (95), రామగుండం (155)
  • జనవరి 18: రామగుండం (250)
  • జనవరి 19: రామగుండం (50), శ్రీరాంపూర్ (200)
  • జనవరి 20: శ్రీరాంపూర్ (71), సుల్తానాబాద్ (179)
  • జనవరి 21: సుల్తానాబాద్ (250)
  • జనవరి 22: సుల్తానాబాద్ (17), బోయిన్‌పల్లి (233)
  • జనవరి 23: బోయిన్‌పల్లి (18), ఎల్లంతకుంట (232)
  • జనవరి 25: ఎల్లంతకుంట (17), కోనరావుపేట (233)
  • జనవరి 27: కోనరావుపేట (12), ముస్తాబాద్ (238)
  • జనవరి 28: ముస్తాబాద్ (17), సిరిసిల్ల (233)
  • జనవరి 29: సిరిసిల్ల (42), తంగళ్లపల్లి (208)
  • జనవరి 30: తంగళ్లపల్లి (75), వీర్నపల్లి (175)
ఫిబ్రవరి:
  • ఫిబ్రవరి 1: వీర్నపల్లి (70), వేములవాడ (180)
  • ఫిబ్రవరి 2: వేములవాడ (65)

షెడ్యూల్ అనుబంధంలో కొన్ని తేదీల వద్ద మండలాల పేర్లు స్పష్టంగా లేనందున డిపాజిటర్లు తమ మండల తేదీని కేంద్రం వద్ద ముందుగా నిర్ధారించుకోవాలని అధికారులు సూచించారు.

ధృవీకరణకు అవసరమైన పత్రాలు

అసలు బాండ్లను పరిశీలన కోసం మాత్రమే చూపించాలని, అధికారులకు సమర్పించాల్సిన అవసరం లేదని సీపీ స్పష్టం చేశారు.

డిపాజిటర్ జీవించి ఉంటే: అసలు బాండ్/రసీదు, సెల్ఫ్ అటెస్టెడ్ కలర్ జిరాక్స్, ఆధార్, పాన్ కార్డు జిరాక్స్, బ్యాంక్ పాస్‌బుక్ మొదటి పేజీ జిరాక్స్ (పేరు, ఖాతా నంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ స్పష్టంగా ఉండాలి), తాజా ఫోటో, మొబైల్ నంబర్, బ్యాంక్ ఖాతాకు లింక్ అయిన మొబైల్ నంబర్, తెలిస్తే ఏజెంట్ వివరాలు తీసుకురావాలి.

డిపాజిటర్ మరణించి నామినీ జీవించి ఉంటే: నామినీ సంతకం చేసిన బాండ్ కలర్ జిరాక్స్, డిపాజిటర్ మరణ ధృవీకరణ పత్రం, నామినీ ఆధార్, పాన్, రేషన్ కార్డు లేదా కుటుంబ ధృవీకరణ పత్రం, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్, ఫోటో, బ్యాంక్ లింక్డ్ మొబైల్ నంబర్ సమర్పించాలి.

డిపాజిటర్, నామినీ ఇద్దరూ మరణిస్తే: చట్టబద్ధ వారసుడు సంతకం చేసిన బాండ్ కలర్ జిరాక్స్, ఇద్దరి మరణ ధృవీకరణ పత్రాలు (అసలు, జిరాక్స్), వారసుని ఆధార్, పాన్, కుటుంబ/చట్టబద్ధ వారసుల ధృవీకరణ పత్రం (అసలు, జిరాక్స్), బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్, ఫోటో, మొబైల్ నంబర్ తీసుకురావాలి.

డిపాజిటర్ స్వయంగా రాలేని పరిస్థితుల్లో: అసలు బాండ్, సంతకం చేసిన కలర్ జిరాక్స్, డిపాజిటర్ ఆధార్, పాన్, బ్యాంక్ పాస్‌బుక్, ఫోటోతో పాటు అధీకృత లేఖ, హాజరయ్యే కుటుంబ సభ్యుని గుర్తింపు పత్రం, కుటుంబ సంబంధాన్ని నిరూపించే పత్రం సమర్పించాలి.

ఏజెంట్ల ద్వారా సమర్పించే వారు: ప్రతి అసలు బాండ్, కలర్ జిరాక్స్ చూపించి బాండ్ గుర్తింపు సంఖ్యను విడిగా నమోదు చేయాలి. ఆధార్, పాన్, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్, ఫోటో, మొబైల్ నంబర్‌తో పాటు ఏజెంట్ కోడ్ తప్పనిసరిగా సమర్పించాలి. పత్రాల పరిశీలన అనంతరం అధికారులు రసీదు (అక్నాలెడ్జ్‌మెంట్) అందజేస్తారు. ఏజెంట్ వివరాలు తెలియకపోతే దరఖాస్తు ఫారమ్‌లో ‘తెలియదు / అందుబాటులో లేదు’ అని పేర్కొనవచ్చని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం, ఐపీఎస్ తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>