మ‌ల్కాజిగిరిలో గంజాయి ముఠా అరెస్ట్!

క‌లం, వెబ్‌డెస్క్‌: అంతర్రాష్ట్ర డ్రగ్స్ అక్రమ రవాణాపై మల్కాజిగిరి పోలీసులు (Malkajgiri Police) ఉక్కుపాదం మోపారు. నాచారం పారిశ్రామిక వాడలోని స్టెర్లింగ్ షూస్ కంపెనీ సమీపంలో ఎస్‌వోటీ ఉప్పల్ జోన్ బృందం, నాచారం పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తున్న ఒక కారును అడ్డగించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.30 లక్షల విలువైన సుమారు 60.380 కిలోల గంజాయితో పాటు ఒక కారు, నాలుగు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఒడిశా, హైదరాబాద్, ముంబై కేంద్రంగా ఈ అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో పరారీలో ఉన్న మరికొందరు నిందితులను పట్టుకోవడంతో పాటు, ఈ సరఫరా నెట్‌వర్క్ మూలాలను గుర్తించేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>