ఘోర రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్‌ మృతి

కలం, జోగులాంబ గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం జింకలపల్లి (Jinkalapally) స్టేజీ సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బెటాలియన్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న యు. భీమేష్(33) అక్కడికక్కడే మృతి చెందాడు. మల్దకల్‌ మండల కేంద్రానికి చెందిన ఉప్పరి మల్లేశ్‌ కుమారుడు భీమేష్(33) ఎర్రవల్లి మండల కేంద్రంలో గల పదవ బెటాలియన్‌లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు.

ఆదివారం భీమేష్ బైక్ పై‌ కోదండపురం వైపు వెళ్తుండగా జాతీయ రహదారి పై గల జింకల స్టేజ్ వద్ద ప్రమాదవశాత్తు బైక్ అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో సంఘటన స్థలంలో మృతి చెందాడు‌. మృతునికి భార్య,‌ రెండు సంవత్సరల కుమారుడు, మూడునెలల కుమార్తె ఉన్నారు. జింకలపల్లి స్టేజీ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంతో స్థానికంగా విషాదం నెలకొంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఇటిక్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>