శ్రీనివాసరావుకు అటవీ సిబ్బంది నివాళి

కలం, ఖమ్మం బ్యూరో: అటవీ సంరక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన అటవీ అధికారి శ్రీనివాసరావు నాలుగో వర్ధంతి సందర్భంగా ఆదివారం అధికారులు, సిబ్బంది నివాళులర్పించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ (Chandrugonda) అటవీ రేంజ్ పరిధిలోని స్మృతివనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్‌తో పాటు పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ​ఈ సందర్భంగా డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ మాట్లాడుతూ.. 2022 నవంబర్ 22న ఇదే ప్రాంతంలో అటవీ ప్లాంటేషన్‌ కాపాడే క్రమంలో జరిగిన దాడిలో శ్రీనివాసరావు అమరులయ్యారని గుర్తుచేసుకున్నారు.

అటవీ సంపద పరిరక్షణ పట్ల ఆయన చూపిన అంకితభావం, చేసిన ప్రాణత్యాగం అటవీ శాఖ సిబ్బందికి స్ఫూర్తిదాయకమని డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ కొనియాడారు. ​భవిష్యత్ తరాలకు పచ్చని అడవులను అందించడమే శ్రీనివాసరావుకు ఇచ్చే అత్యుత్తమ నివాళి అని డీఎఫ్ఓ స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో స్మృతివనాన్ని సందర్శించే యువ అధికారులు, విద్యార్థులు అక్కడి పచ్చదనాన్ని చూసి ఆయన చేసిన త్యాగాన్ని స్మరించుకునేలా అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>