దాసాంజనేయ స్వామి దేవాలయ పునఃప్రతిష్ఠ.. పాల్గొన్న ఎమ్మెల్యే కుంభం!

కలం, వలిగొండ : వలిగొండ మండలంలోని పల్లెవంపు గ్రామంలో ఆదివారం నిర్వహించిన శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయ పునఃప్రతిష్ఠ, నూతన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి (MLA Kumbam) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేవాలయాలు ప్రజలలో భక్తి భావాన్ని, సహనాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బద్దం కరుణశ్రీ – పవన్ కుమార్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>