కలం, వెబ్ డెస్క్: అమెరికా మాజీ వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ (Karoline Leavitt) సంచలన పోస్ట్ చేశారు. అమెరికన్లు పెళ్లి చేసుకుని.. ఎక్కువ మంది పిల్లల్ని కనాలని పిలుపునిచ్చారు. ప్రపంచ జనాభాలో ముస్లిం సంఖ్య పెరుగుతుందన కథనాల మేరకు ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. “పెళ్లి చేసుకోండి.. ఎక్కువ మంది పిల్లలను కనండి.. వారిని చర్చికి తీసుకెళ్లి పెంచండి.. అమెరికాను ప్రేమించడం వారికి నేర్పించండి” అని కరోలిన్ పేర్కొన్నారు. ఈ పోస్టుతో పాటు ది వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించిన ఓ కథనం హెడ్డింగ్ ఫోటోను కూడా యాడ్ చేశారు. 2035 నాటికి ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవుల సంఖ్యను ముస్లింల సంఖ్య అధిగమిస్తుందనే అధ్యయనానికి సంబంధించిన శీర్షికను ఆమె షేర్ చేశారు.
కరోలిన్ లీవిట్ పోస్ట్ పై భిన్నాభిప్రాయాలు
కరోలిన్ లివిట్ (Karoline Leavitt) పిలుపుపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆమె అభిప్రాయాలకు మద్దతు ఇస్తూ.. వివాహ వ్యవస్థ, కుటుంబ విలువలు, మత విశ్వాసాల ప్రాధాన్యతను గుర్తు చేశారు. మరికొందరు ఆమె పోస్ట్ పై విమర్శలు గుప్పించారు. ఒక నిర్దిష్ట మతాన్ని అనుసరించాలని ప్రజలను ప్రోత్సహించడం తగదని కామెంట్స్ పెడుతున్నారు. పెరుగుతున్న జీవన వ్యయం, ఆర్థిక సమస్యలను ప్రస్తావిస్తూ కరోలిన్ లివిట్ పిలుపుపై మండిపడ్డారు.

