కలం, వెబ్ డెస్క్: సినిమాల ప్రమోషన్ ల కోసం హీరోలు, డైరెక్టర్లు వినూత్న పద్ధతులను ఎంచుకుంటుంటారు. ఈ క్రమంలో తమిళ నటుడు, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోని (Vijay Antony) తన మూవీ ప్రమోషన్ (Movie Promotion) కోసం సరికొత్త ప్రయోగం చేశాడు. ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా సామాన్యుడిలా రైలు జనరల్ బోగీలో ప్రయాణించాడు. చెన్నై నుంచి కోయంబత్తూరుకు కోవై ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కాడు. తన తాజా చిత్రం అప్పా కుట్టి ప్రమోషన్ లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాడు.
జనరల్ బోగీలో సామాన్యుడిలా కూర్చోని తోటి ప్రయాణికులతో విజయ్ ఆంటోని ముచ్చటించాడు. సినిమాకు సంబంధించిన విషయాలను వారితో పంచుకున్నాడు. ఎలాంటి హడావుడి లేకుండా ప్రయాణించిన స్టార్ హీరోను (Vijay Antony) చూసిన వారందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో సినిమా ప్రమోషన్ కోసం థియేటర్లకు వెళ్లి నేరుగా ప్రేక్షకులను కూడా కలిసేందుకు విజయ్ ఆంటోని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
Also Read : ఏడేళ్ల ప్రేమకు బ్రేకప్.. ప్రియురాలి ఇల్లు తగలబెట్టిన యువకుడు!
Follow Us On: X(Twitter)

