కలం, నేరడిగొండ: నేరడిగొండ మండల కేంద్రంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నట్లు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ (MLA Anil Jadhav) తెలిపారు. ఆదివారం రూ. 50 లక్షల నిధులతో చేపట్టనున్న సీసీ సైడ్ డ్రైన్ల నిర్మాణ పనులకు ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నేరడిగొండ మండల కేంద్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి, త్వరలోనే గ్రావెల్ రహిత గ్రామంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
ప్రతి కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తాను 24 గంటలు అందుబాటులో ఉంటానని, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నేరుగా తనను సంప్రదించాలని ఎమ్మెల్యే (MLA Anil Jadhav) సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నీలిమ రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ రాథోడ్ సృజన్, మాజీ జడ్పీటీసీ పండరీ, మాజీ ఉపసర్పంచ్ దేవేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

