కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఏఐసీసీ ఇంచార్జ్ బిఎం సందీప్ కుమార్ (BM Sandeep Kumar) హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి విచ్చేసిన ఆయనకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు.
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీడబ్ల్యూసీ సభ్యుడు వంశీ చంద్ రెడ్డి, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఏఐసీసీ మాజీ కార్యదర్శి సంపత్ కుమార్, ప్రోటోకాల్ చైర్మన్, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ఫయీమ్, పార్టీ నాయకులు రోహిన్ రెడ్డి, కిషోర్ రెడ్డి విమానాశ్రయానికి చేరుకుని బిఎం సందీప్ కుమార్‌కు పుష్పగుచ్ఛాలు అందజేసి సాదరంగా ఆహ్వానించారు.
Also Read : తక్కువ నీటితో సిరుల పంట.. ఇదీ ‘అంకాపూర్’ మ్యాజిక్!
Follow Us On : WhatsApp

