కలం, వెబ్ డెస్క్: భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు అమర్ పాల్ మౌర్యతో భేటీ అయ్యారు. అనంతరం చాహల్ ను ఓబీసీ మోర్చా కార్యవర్గ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించింది. బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ ఆదేశాలతో నియామకం చేపట్టారు. బీజేపీలో చేరడంపై చాహల్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. బీజేపీ కుటుంబంలో తనకు స్థానం, గౌరవం కల్పించినందుకు ప్రధాని మోదీ, అమిత్ షా, నితిన్ నబీన్, అమర్ పాటిల్ మౌర్యలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
మోదీ, చాహల్ పాత వీడియో వైరల్..
ఇండియన్ స్పిన్నర్ చాహల్ బీజేపీలో చేరడంతో మోదీని ఆయన (Yuzvendra Chahal) కలిసిన పాత వీడియో వైరల్ అవుతోంది. టీమిండియా 2024లో టీ20 ప్రపంచ కప్ గెలిచిన సందర్భంగా భారత జట్టు సభ్యులు ప్రధాని మోదీని కలిశారు. ఈ సందర్భంగా చాహల్ సైతం మోదీ దగ్గరకు వెళ్లారు. అప్పుడు చాహల్ ఎందుకు సీరియస్ గా ఉన్నావని ప్రధాని ప్రశ్నించారు. దీంతో టీం సభ్యులు ఒక్కసారిగా నవ్వారు. ఆ సమయంలో మోదీ మాట్లాడుతూ.. హర్యాణా ప్రజలు చాలా ఆనందంగా ఉంటారని, ప్రతి విషయంలోనూ సంతోషం వెతుక్కుంటారని తెలిపారు. కాగా, టీమిండియా క్రికెకటర్లు గౌతమ్ గంభీర్, రవీంద్ర జడేజా కూడా ఇప్పటికే బీజేపీలో కొనసాగుతున్నారు.
PM MODI IN 2024 : Why is Chahal so serious? Haryana people are always happy 😅
Yuzvendra Chahal (Today) : Thanks to PM Modi for giving me a place in the BJP family 🔥 https://t.co/St3podfqjS
— News Algebra (@NewsAlgebraIND) November 21, 2026

