మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌నే ప్ర‌ధాన ల‌క్ష్యం: కూనంనేని

​కలం, ఖమ్మం బ్యూరో: గ్రామాలు, బస్తీలు, కాలనీల సమగ్రాభివృద్ధితో పాటు మౌలిక వసతుల కల్పనే తన ప్రధాన లక్ష్యమని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (MLA Kunamneni Sambasiva Rao) అన్నారు. శనివారం చుంచుపల్లి మండలంలోని బాబు క్యాంప్, ఎన్కే నగర్ గ్రామాల్లో రూ.79.50 లక్షల విలువైన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో రూ.43 లక్షల సిసి రోడ్లు, డ్రైన్లు, రూ.10 లక్షల విఓ బిల్డింగ్ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. అలాగే రూ.11.50 లక్షల మినీ వాటర్ స్కీమ్, రూ.11 లక్షల సిసి రోడ్డు, రూ.4 లక్షల రిటైనింగ్ వాల్‌లను ప్రారంభించారు.

​అనంతరం బాబు క్యాంప్‌లో ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ నమోదు ప్రక్రియను ఎమ్మెల్యే లాంఛనంగా ప్రారంభించారు. ఆపద సమయంలో కుటుంబ పెద్దను కోల్పోయిన పేద కుటుంబాలకు ఈ బీమా కొండంత ఆసరాగా నిలుస్తుందని తెలిపారు. అర్హులందరికీ ప్రభుత్వ ఫలాలు పారదర్శకంగా అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించి నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, జిల్లా పంచాయతీ అధికారిని అనూష, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>