దేవరకోట ఆలయంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ప్రత్యేక పూజలు

కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని పురాతన దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని (Devarakota Temple) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రాథోడ్ సుదర్శన్ (Rathod Sudarshan) శనివారం సందర్శించారు. స్వామివారికి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు అందజేశారు.

అనంతరం ఆలయంలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న పల్లకీ సేవ, భక్తులకు మధ్యాహ్న భోజనం, రాత్రి అల్పాహార పంపిణీ కార్యక్రమాల నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో భూమయ్య, పూజారి నవీన్, ధర్మకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>