15 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు.. యువజన సమితిపై జ్యోతి ప్రశంసలు

కలం, జగిత్యాల : జగిత్యాలలోని భక్త మార్కండేయ యువజన సమితి (Bhakta Markandeya Youth Association) గత 15 ఏళ్లుగా చేస్తున్న సేవలు అభినందనియమని జగిత్యాల మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఆడువాల జ్యోతి లక్ష్మణ్ కొనియాడారు. స్వామి వివేకానందుని స్ఫూర్తితో ‘ఓదార్చే మాటల కన్నా సహాయం చేసే చేతులే మిన్న’ అనే నినాదంతో రాయికల్‌కి చెందిన గోసికొండ జమున-కిషన్ దంపతుల కుమార్తె వివాహానికి యువజన సమితి శనివారం రూ.15 వేల ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ నెల 25న జరగనున్న వివాహం సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఆడువాల జ్యోతి దంపతుల చేతుల మీదుగా ఆర్థిక సహాయాన్ని అందించారు. అలాగే గీత సిల్క్ హౌస్ అధినేత కస్తూరి జగదీశ్వర్ కుమారుడు శశిధర్-లహరిక దంపతుల సహకారంతో వధువుకు కంచి పట్టు చీరను బహూకరించారు. ఈ సందర్భంగా ఆడువాల జ్యోతి మాట్లాడుతూ.. సమితి గత 15 ఏళ్లుగా నిరుపేద కుటుంబాలకు వివాహాలు, విద్య, ఇతర అవసరాలతో పాటు ఆపద సమయంలోనూ ఆర్థిక సహాయం అందించడం గొప్ప విషయమన్నారు.

సమాజ సేవలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలకు తన వంతు సహకారం అందించడం సంతోషంగా ఉందని తెలిపారు. సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్న సమితి సభ్యులను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహకులు ఆకుబత్తిని (గౌరి) శ్రీనివాస్, కొక్కుల సుదర్శన్, బోగ మల్లేశం, సంగీత శ్రీనివాస్, చెన్న రమేష్, మాచర్ల శంకర్, కొక్కుల శేఖర్, పొలాస శంకర్, బోగ రాజేశం, అలుసా రామప్రకాశ్, చిలుక రాజన్న, బోగ చిన్న గంగాధర్, తవుటూ రామచంద్రం, చెట్‌పెల్లి సుధాకర్, వీరభత్తిని అనిల్, సామల నటశేఖర్, సింగం గంగాధర్, నందగిరి నర్సయ్య, స్వర్గం వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

​  

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>