కలం, వెబ్ డెస్క్: సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సహ యజమాని, సన్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కావ్య మారన్ (Kavya Maran) తన పెళ్లి సందర్భంగా ఉద్యోగులకు భారీ సర్ ప్రైజ్ ఇచ్చారు. సన్ గ్రూప్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ బంగారు ఉంగరాలను కానుకగా ఇచ్చారు. ఉద్యోగులకు అందించిన గిఫ్ట్ బాక్సులకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఓ ఉద్యోగి బహుమతులకు సంబంధించిన వీడియోను షేర్ చేసిన వీడియోలో.. కావ్యా మారన్ పంపిన గిఫ్ట్ బాక్సుల్లో బంగారు ఉంగరాలతో పాటు చాక్లెట్లు, వెడ్డింగ్ కార్డు ఉన్నట్లు వీడియోలో కనిపిస్తోంది. అలాగే, చెన్నై, హైదరాబాద్ ఉద్యోగులకు స్పెషల్ లంచ్ ఏర్పాటు చేశారు.
గ్రీస్ లో వివాహం.. చెన్నైలో రిసెప్షన్
సెన్సెషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ను కావ్యా మారన్, నవంబర్ 11 న గ్రీస్ లో పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరిద్దరు వివాహబంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లికి సూపర్‌స్టార్ రజనీకాంత్, తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కాగా, నేడు (నవంబర్ 21)న చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళ హోటల్ లో అనిరుధ్ – కావ్య (Anirudh – Kavya Maran) రిసెప్షన్ వేడుక ఘనంగా జరగనుంది. సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
Also Read : తెలుగు సినిమాలపై మళ్లీ పైరసీ పంజా..!
Follow Us On : WhatsApp

