కలం, నిజామాబాద్ బ్యూరో: టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) నిజామాబాద్లో బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని ఆయన పేర్కొన్నారు. ఆధారాలతో సహా దొరికిపోయిన అవినీతిపరులు వారేనని విమర్శించారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా, హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో భారీగా నీటి దోపిడీ జరిగిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) పేరుతో లక్షల కోట్లు వృథా చేశారని, రాష్ట్రంలో విచ్చలవిడిగా భూదోపిడి జరిగిందని ఆరోపించారు. వారి అవినీతి చిట్టా చాలా పెద్దదని విమర్శించారు.
రాహుల్ గాంధీని మహనీయుల బిడ్డ గా మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అభివర్ణించారు. ఆయనకు వ్యక్తిగత ప్రయోజనాల కంటే దేశ సేవే ముఖ్యమని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి ఎంతో కమిట్మెంట్తో రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని అభినందించారు. తెలంగాణకు రావాల్సిన నీటి వాటా విషయంలో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఆయన స్పష్టం చేశారు.
Also Read : అనిరుధ్ – కావ్య పెళ్లి.. ఉద్యోగులకు సర్ప్రైజ్ గిఫ్ట్స్!
Follow Us On : WhatsApp

